వైఎస్ఆర్ ముందుచూపు వల్లే...:కేవీపీ | Polavaram drains completed by Dr.YS RajaSekhar Reddy tells kvp in delhi | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ ముందుచూపు వల్లే...:కేవీపీ

Published Wed, Aug 24 2016 6:45 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

వైఎస్ఆర్ ముందుచూపు వల్లే...:కేవీపీ - Sakshi

వైఎస్ఆర్ ముందుచూపు వల్లే...:కేవీపీ

న్యూఢిల్లీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముందుచూపు వల్లే పోలవరం కాల్వలు పూర్తయ్యాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ముందు కాల్వలు తవ్వడమేంటని ప్రశ్నించారని కేవీపీ అన్నారు. ఇప్పుడు ఆ కాల్వలతోనే బాబు నీళ్లు ఇస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖ రాసినా స్పందించలేదని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై కాకుండా ప్రత్యేక ప్యాకేజీ మీదే శ్రద్ద పెడుతున్నారని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement