న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర విభజనకు అందరి అభిప్రాయాలు అవసరమని సూచించినట్లు కేవీపీ రామచంద్ర రావు ఈరోజు రాజ్యసభలో తెలిపారు. తెలంగాణ అంశంపై జరిగిన చర్చలో ఆయన ఆయన మాట్లాడారు. ప్రాంతీయ వాదాన్ని వైఎస్ సమర్ధించారనడం సరికాదన్నారు. 2002లో తెలంగాణ విభజన నిర్ణయాన్ని అప్పటి హోం మంత్రి అద్వానీ తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. 2002 ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ బిల్లును అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వానీ తిరస్కరించారన్నారు.
2004 మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ రెండో ఎస్సార్సీనే ప్రస్తావించిందన్నారు. 2004లోనే రెండో ఎస్సార్సీని ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్-టీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రం నలుమూలల పర్యటించి శ్రీకృష్ట కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలన్నారు.
అందరి అభిప్రాయాలు అవసరమన్న వైఎస్: కెవిపి
Published Mon, Aug 12 2013 6:04 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement