
రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు (ఫైల్‌ఫోటో)
పెద్దల సభలో హోదాపై ప్రైవేట్ మెంబర్..
సాక్షి, న్యూఢిల్లీ : 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను రద్దు చేయాలని సిఫార్సు చేసినట్టు ఎక్కడా వెల్లడించలేదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. అవాస్తవాన్ని నిజమని నమ్మించవచ్చని బీజేపీ విశ్వసిస్తోందని, అందుకోసమే వాళ్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హోదాపై ఆర్థిక సంఘం ఎలాంటి ప్రతికూల సిఫార్సులూ చేయకపోయినా ఎవరికీ కనిపించనివి బీజేపీకి మాత్రమే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రత్యేక హోదాపై ఏపీలో రోజురోజుకూ పోరు ఉధృతమవుతోందన్నారు. హోదా పోరాటం కొనసాగుతుందని, సోనియా గాంధీ సైతం ప్రయత్నాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలతో సహా అప్పటి ప్రధాని మన్మోహన్ గాంధీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ రామచంద్రరావు గురువారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెట్టారు. కేవీపీ ప్రవేశపెట్టిన తీర్మానం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు చర్చకు వచ్చే అవకాశం ఉంది.