వీఐపీ దర్శన టికెట్లు బాగా తగ్గించాం | Tickets vision viaipi well shortage | Sakshi
Sakshi News home page

వీఐపీ దర్శన టికెట్లు బాగా తగ్గించాం

Published Wed, Jun 3 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

వీఐపీ దర్శన టికెట్లు బాగా తగ్గించాం

వీఐపీ దర్శన టికెట్లు బాగా తగ్గించాం

టీటీడీ చైర్మన్ చదలవాడ

తిరుపతి అర్బన్: తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులే ఎక్కువ సంఖ్యలో దర్శించుకునే విధంగా వీఐపీ దర్శన టికెట్లను బాగా తగ్గించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. మంగళవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూచన మేరకు తిరుమలలో అన్ని విభాగాల సమాచారాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

ఇప్పుడు రోజుకు కేవలం పదిహేను వందలనుంచి  నుంచి రెండువేల మందికి మాత్రమే వీఐపీ దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. టీటీడీ-మున్సిపల్ కార్పొరేషన్-తుడాల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో, యాత్రికులు నడిచి వెళ్లే మార్గాల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement