అంగన్‌వాడీల బలోపేతానికి కృషి | effort to the anganwadi development | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల బలోపేతానికి కృషి

Published Wed, Sep 14 2016 10:26 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

అంగన్‌వాడీల బలోపేతానికి కృషి - Sakshi

అంగన్‌వాడీల బలోపేతానికి కృషి

నల్లగొండ : జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో స్త్రీ, శిశుసంక్షేమస్థాయీ సంఘం సమావేశంలో జరిగింది. ఈ సమామావేశానికి కమిటీ చైర్‌పర్సన్‌ చుక్క ప్రేమలత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలవుతున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్ల బలోపేతం చేసేందుకు వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం అందింస్తోందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి, జెడ్పీసీఈఓ రావుల మహేందర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ సునంద, జెడ్పీటీసీ సభ్యులు, సీపీడీఓలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement