
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమలలో శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ సాంబశివరావు సతీసమేతంగా ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అలాగే తమిళ నటుడు ఎస్.వి.శేఖర్ స్వామివారిని దర్శించుకున్నారు.