జయశంకర్ ఆశయసాధనకు కృషి చేయాలి
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు టీఆర్‌ఎస్ పార్టీ, జర్నలిస్టుల ఫోరం, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు టీఆర్‌ఎస్ పార్టీ, జర్నలిస్టుల ఫోరం, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్‌కు ప్రభుత్వ విప్ సునీత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు కాటబత్తిని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కమలమ్మ, సర్పంచ్ బూడిద స్వామి, ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్ రామకృష్ణ, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్‌గౌడ్, సీనియర్ జర్నలిస్టు రాయగిరి పాండు, యాదగిరిగౌడ్, కర్రె వెంకటయ్య, రవీందర్‌గౌడ్, పుల్లయ్య, వినోద్‌కుమార్, వెంకటయ్య, సలీం, ఎస్‌డీ బాబా, బాల్‌నర్సయ్య, సాయి, వంశీకృష్ణ, అరుణ్, ప్రసాద్ పాల్గొన్నారు.