వీఐపీ విజృంభిస్తున్నాడు..
విభిన్న పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ తాజా చిత్రం వీఐపీ తమిళనాట కలెక్షన్లతో విజృంభిస్తోంది. జూలై 18 తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వేలయ్ ఇల్లా పట్టధారి (వీఐపీ) చిత్రం ధనుష్ కెరీర్ లో అత్యధికంగా ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డును నెలకొల్పింది.
350 కి పైగా థియేటర్లలో విడుదలైన వీఐపీ చిత్రం తమిళనాడులోనే నికరంగా 4.36 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన టాప్ ఫైవ్ చిత్రాల్లో ఒకటిగా విఐపీ నిలిచి ఓ కొత్త రికార్డును సాధించింది. ఫ్రాన్స్ లో 2014లో విడుదలైన చిత్రాల్లో వీఐపీ ఒకటిగా నిలిచింది.
అమెరికాలో విడుదలైన మూడు రోజుల్లోనే వీఐపీ చిత్రం లక్ష డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.