ఆ ఇద్దరితో మరింత... | After Amy Jackson, Dhanush ropes in Samantha for VIP team's next | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరితో మరింత...

Published Mon, Dec 29 2014 1:57 AM | Last Updated on Thu, Mar 28 2019 6:14 PM

ఆ ఇద్దరితో మరింత... - Sakshi

ఆ ఇద్దరితో మరింత...

 సక్సెస్ ఇచ్చే కిక్కే వేరు. ఆ మజాలో ఉన్న వీఐపీ (వేళై ఇల్లా పట్టాదారి) టీమ్ మరోసారి కలిసి నడవనుంది. అయితే ఈసారి మరింత పెద్ద హిట్ సాధించడానికి ప్రయత్నిస్తోంది. నటుడు ధనుష్ నటించి నిర్మించిన చిత్రం వేళై ఇల్లా పట్టాదారి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు వేల్‌రాజ్ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో అమలాపాల్, సురభి నాయికలుగా నటించారు. అనిరుధ్ సంగీత బాణీలందించిన ఈ చిత్రం విజయం ధనుష్‌కు కథా నాయకుడిగాను, నిర్మాతగాను చాలా కీలకమైంది.
 
 అంతకుముందు నటుడిగా కాస్త తడబడిన ధనుష్‌కు వీఐపీ చిత్ర విజయం ఎంతో ఊరటనిచ్చింది. అందుకే  ఆ చిత్ర యూనిట్ తోనే మరో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు వేల్‌రాజ్ మంచి కథను తయారు చేశారు. ధనుష్‌కు అది నచ్చింది. ఇంకేముంది చిత్రం సెట్స్‌కు వెళ్లడానికి రెడీ అయ్యింది. అయితే మొదట వీఐపీ టీమ్‌తోనే చిత్రం చేయాలని భావించారు. కానీ చిన్న మార్పులు చేయక తప్పలేదట. ఆ మార్పులే తీయబోయే చిత్రానికి భారీ విలువలు ఆపాదించనుంది.
 
 వీఐపీ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన అమలాపాల్, సురభిలనే తాజా చిత్రంలోనూ నటింప చేయాలని అనుకున్నా అలా జరగడం లేదు. అమలాపాల్ దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. దీంతో ఆమెకు బదులు క్రేజీ స్టార్ సమంతను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా సురభికి బదులు ఎమిజాక్సన్ ఎంపికయ్యారు. ఇదరు హీరోయిన్లకూ చిత్రంలో ప్రాముఖ్యత ఉంటుందట. చిత్రం 2015 ఫిబ్రవరిలో సెట్‌పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈలోపు ప్రస్తుతం నటిస్తున్న మారి చిత్రాన్ని ధనుష్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement