
కన్నడ వీఐపీలో అమలాపాల్
కన్నడ చిత్రం వీఐపీలో నటించే అవకాశం నటి అమలాపాల్ తలుపు తట్టింది. వివాహానికి ముందు మాతృభాష మలయాళంతోపాటు తమిళం, తెలుగు భాషల్లో అమలాపాల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయనే చెప్పాలి. అంతే కాదు పెళ్లి తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే భర్త విజయ్ నుంచి విడిపోయి విడాకులకు సిద్ధం అయ్యారో ఆ తరువాత వస్తాయనుకున్న అవకాశాలు కూడా వెనక్కు పోయాయి.
ఈ మధ్య నటించిన అమ్మాకణక్కు లెక్క తప్పింది. దీంతో ఆ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ తన తాజా చిత్రం వడచెన్నైలో తనకు నాయకిగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ ఒక్క చిత్రమే అమలాపాల్ చేతిలో ఉంది. ఇంతకు ముందు ధనుష్ సరసన నటించిన సక్సెస్‌ఫుల్ చిత్రం వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ) ఇప్పుడు కన్నడంలో రీమేక్ కానుంది.
రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించినున్న ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్రన్ వారసుడు మనోరంజన్ హీరోగా నటించనున్నారు. ఆయనకు జంటగా చాలా మంది హీరోయిన్లను పరిశీలించారట. ఎవరూ సెట్ కాక పోవడంతో చివరికి ఈ అవకాశం నటి అమలాపాల్ తలుపు తట్టింది. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక పూర్తి కాగానే షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. అమలాపాల్ ఇంతకు ముందే సుదీప్‌కు జంటగా హెబులి అనే చిత్రం ద్వారా కన్నడ చిత్ర రంగ ప్రవేశం చేశారు.