వీఐపీ ఘాట్లలో అన్ని ఏర్పాట్లు
(మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద నిర్మిస్తున్న వీఐపీ, వీవీఐపీల ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి, వీఐపీ ఘాట్ ప్రత్యేక అధికారి అమృతారెడ్డి తెలిపారు. మట్టపల్లి క్షేత్రం వద్ద వీఐపీలకు కేటాయించిన ప్రహ్లాద ఘాట్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఘాట్ వద్ద ఉన్న కొన్ని పాత గోడలను పూర్తిగా తొలగిస్తామని, నూతనంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నది వద్ద ప్రమాదకరమైన ప్రదేశాలకు ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఐబీ ఏఈలు పిచ్చయ్య, భిక్షం, వీఆర్‌వో వెంకటరామారావు తదితరులు ఉన్నారు.