
జైపూర్: బహుజన సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన వారేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్‌నారయణ్ మీనా తెలిపారు. స్పీకర్ వారిని కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలుగా గుర్తించినట్లు చెప్పారు. ఎమ్మెల్యేల సభ్యత్వం గురించి మీనా మాట్లాడుతూ, ‘బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. నేను ఎలాగైతే ఎమ్మెల్యేనో వారు కూడా అంతే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు’ అని తెలిపారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి విప్ జారీ చేయడంపై ఆయన మాట్లాడుతూ, మాయావతి దళిత పార్టీ సమావేశాలకు హాజరుకారని, ఆమె కేవలం ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారని అని విమర్శించారు. ఆమె అసలు నాయకురాలు కాదని, కాన్షీరామ్‌ను ఆమెలో చూసుకోవడం కారణంగా నాయకురాలిగా మారారని ధ్వజమెత్తారు. రాజస్తాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌కు మద్దతుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకూడదని మాయావతి విప్ జారీ చేశారు. దీంతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది.
Comments
Please login to add a commentAdd a comment