
జైపూర్: రాజస్తాన్ బీఎస్పీ ఎమ్మెల్యే రాజేంద్ర గుదా ఆ పార్టీ చీఫ్ మాయావతిపై సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వడానికి మాయావతి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. తన కంటే ఎక్కువ మొత్తం ఇంకా ఎవరైనా ఇచ్చిఉంటే టికెట్ తనకు కాకుండా వేరే వాళ్లకు దక్కేదంటూ విమర్శించారు. శుక్రవారం జైపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో రాజేంద్ర మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే.. టికెట్లు వారికే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాగా మాయావతిపై ఇంతకుముందు ఇదే విధంగా పలువురు నేతలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై బీఎస్పీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment