హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ విప్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఏకగ్రీవం కాగా.. తెలంగాణలో మాత్రం ఆరు సీట్లకు గాను ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నలుగురిని గెలిపించుకునే సామర్థ్యం ఉండగా మరో వ్యక్తిని కూడా రంగంలోకి దించింది. దీంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని ఊహించిన కాంగ్రెస్ వెంటనే కేంద్రం నుంచి పార్టీ పరిశీలకులు ఆజాద్ను, వయలార్ రవిని రంగంలోకి దించింది.
వారు వచ్చిన అనంతమే తాజాగా కాంగ్రెస్ విప్ జారీ చేయడంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు వేడిపుట్టిస్తున్నాయి. జూన్ 1న జరిగే పోలింగ్లో పాల్గొని పార్టీ అభ్యర్థి ఆకుల లలితకు ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ తన విప్లో పేర్కొంది. ఇప్పటికే ఈ విప్ పలువురు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అందినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.
'మన అభ్యర్థికే ఓటు వేయండి'
Published Fri, May 29 2015 5:57 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement