- వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక మెనూ
- శంకుస్థాపననాడు ఇదీ సంగతి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపనకు వచ్చే వారి కోసం ప్రభుత్వం మూడు కేటగిరీల భోజనాలను తయారు చేయిస్తోంది. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకమైన మెనూ, రైతులు, ప్రజలకు సాధారణ మెనూ ఖరారు చేశారు. దేశవిదేశాల నుంచి వచ్చే అత్యంత ముఖ్యులకు(వీవీఐపీ) ప్రత్యేకమైన తెలుగు సంప్రదాయ వంటకాలను రుచి చూపించనున్నారు. ఒక్కో భోజనం ఖర్చు రూ.1,250 చొప్పున 1,000 మంది కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. వీఐపీల కేటగిరీలో 10,000 మందికి మరో ప్రత్యేకమైన మెనూను ఆర్డర్ ఇచ్చింది. ఈ భోజనానికి రూ.650 వంతున చెల్లిస్తారు. నిజానికి వీఐపీల కేటగిరీలో 1,500 మందికి ఆహ్వానాలు పంపారు. ఆ సంఖ్య కొంత పెరిగినా ఇబ్బంది లేకుండా వేదిక ముందు 2,000 సీట్లను కేటాయిస్తున్నారు. ఈ కేటగిరీలో 10వేల భోజనాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇందుకు రూ.77.5 లక్షలు ఖర్చు కానుంది.
లక్షన్నర మందికి సాధారణ భోజనం
శంకుస్థాపన కార్యక్రమానికి లక్షన్నర మంది రైతులు, ప్రజలు హాజరవుతారని అంచనా. వీరికి సాధారణ భోజనమే అందించనున్నారు. ఒక్కో భోజనానికి రూ.150 చొప్పున చెల్లిస్తున్నారు.సాధారణ భోజనాలకు రూ.2.25 కోట్లు ఖర్చవుతోంది. అంటే మొత్తం భోజనాల కోసం ప్రభుత్వం రూ.3 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది.
మూడు రకాల భోజనాలు
Published Mon, Oct 19 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement
Advertisement