
హైదరాబాద్: నిమ్స్‌లో కరోనాతో బాధపడుతున్న పలువురు ప్రముఖులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. నిమ్స్ పాత భవనంలోని స్పెషల్ రూమ్‌లో చికిత్స పొందుతున్న వారిలో నిజామాబాద్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కె. సాంబశివరావు చికిత్స పొందుతున్నారు. నిమ్స్ వైద్యులు, ఉద్యోగులకే పరిమితమైన కోవిడ్ సేవలు రాష్ట్రంలోని ప్రముఖులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. నిమ్స్‌లో పని చేస్తున్న వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా మూడు వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment