
దత్తపుత్రుల కోసం ఓ ఇల్లు
నటి హన్సికది చాలా విశాల హృదయం అన్న విషయాన్ని మరోసారి నిరూపించుకోనున్నారామె. నటిగా కోలీవుడ్‌లో నెంబర్‌వన్ స్థానంలో దూసుకుపోతున్న ఈ ఉత్తరాది బ్యూటీ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. అరణ్మణై, ఆంబల అంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న హన్సిక ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. ఈమెకు తల్లిగా రాణి పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవి నటించడం విశేషం. తన ఒక్కో పుట్టిన రోజుకు ఒక్కరు చొప్పున అనాథలను దత్తత చేసుకుని వారి సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికీ 23 బాలల వరకు దత్తత తీసుకున్న హన్సిక తాజాగా వారి నివాసం కోసం ఒక అందమైన భవనాన్ని నిర్మించ తలపెట్టారున్నారన్నది తాజా సమాచారం. ఈ ముద్దుగుమ్మ చాలాకాలంగా ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ఇంటిని నిర్మించుకోవాలని ఆశిస్తున్నారు. ఆ కోరిక కూడా ఇప్పుడు నెరవేర్చుకోనున్నారట. ముంబయి సమీపంలో ఒక ఎకరా స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ తన దత్త పుత్రుల కోసం అందమైన భవనాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారట.