సంక్రాంతి పండుగను వారితోనే.. ప్రస్తుతం 31 మంది పిల్లలు ఉన్నారు  | I enjoy adopting and raising children: Actress Hansika | Sakshi
Sakshi News home page

సంక్రాంతి పండుగను వారితోనే.. ప్రస్తుతం 31 మంది పిల్లలు ఉన్నారు 

Published Thu, Jan 19 2023 7:49 AM | Last Updated on Thu, Jan 19 2023 7:49 AM

I enjoy adopting and raising children: Actress Hansika - Sakshi

దక్షిణాదిలో బబ్లీగర్ల్‌గా పేరు తెచ్చుకున్న నటి హన్సిక. ముంబైకి చెందిన ఈ భామను దక్షిణాది సినిమానే అక్కున చేర్చుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటిస్తూ పేరు తెచ్చుకుంది. ఇక్కడ విజయ్, సూర్య, ధనుష్‌, శివకార్తికేయన్, ఆర్య వంటి ప్రముఖ నటులతో జత కట్టింది. నటుడు శింబు సరసన నటించి ఆయన ప్రేమలో కొంతకాలం మునిగి తేలింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది.

అయితే అది మనస్పర్థలతోనే నిలిచిపోయింది. కాగా గత డిసెంబర్‌ 4న సోహైల్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆ మధురమైన తరుణాలను ఆస్వాదిస్తోంది. హన్సికలో సేవాగుణం ఎక్కువే. అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది. కాగా సంక్రాంతి పండుగను వారితో గడిపి సంతోషాన్ని పంచుకుంది. దీని గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో పండగ రోజుల్లో ఇతరులకు సాయం చేయాలని తన తల్లి చిన్న వయసులోనే చెప్పిందని పేర్కొంది. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని చెప్పిందని, అందుకే తాను నటి అయిన తరువాత అనాథ పిల్లలను దత్తత తీసుకున్నట్లు చెప్పింది.

ప్రస్తుతం 31 మంది పిల్లలు ఉన్నారని తెలిపింది. వారిని దత్తత తీసుకుని పోషించడం సంతోషంగా ఉందని చెప్పింది. సంక్రాంతి రోజున వారికి నూతన వ్రస్తాలు కొని ఇవ్వడంతో వారిలో సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంది. భగవంతుడి ఆశీస్సులతో తన జీవితం ఆనందంగా సాగుతోందని చెప్పింది. పెళ్లి తరువాత సినిమాకు కొంచెం గ్యాప్‌ ఇచ్చానని, సమీప కాలంలో ఒక వాణిజ్య ప్రకటనలో నటించానని చెప్పింది. అయితే ఈ నెల 20వ తీదీ నుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పింది. చేతిలో 7 చిత్రాలు, 2 వెబ్‌ సిరీస్‌ ఉన్నాయని, తాను నటిగా బిజీగా ఉన్నానని హన్సిక పేర్కొంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement