
తమిళసినిమా: ముంబాయ్ బ్యూటీ హన్సికకు దక్షిణాదిలో క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. మొదట్లో బొద్దుగా ముద్దుగా ఉన్న హన్సిక ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారిపోయింది. ఈమె ఎన్నో ఆశలు పెట్టుకున్న 50వ చిత్రం మహా చాలా నిరాశపరచింది. అయితే ప్రస్తుతం అర డజనకు పైగా చిత్రాల్లో (తెలుగు, తమిళ భాషల్లో) నటిస్తూ బిజీగానే ఉంది. ముఖ్యంగా తెలుగులో పార్టనర్ రౌడీ బేబీ చిత్రాలతో పాటు విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతుంది.
ఇప్పుడు మరో చిత్రం హన్సికను వరించినట్లు తెలుస్తోంది. ఆర్.కన్నన్ తాజాగా దర్శకత్వం వహించనున్న చిత్రంలో హన్సిక కథానాయకిగా ఎంపికైనట్టు సమాచారం. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన కాసేడా.. కడవులడా చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 7వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే పొన్నియిన్ సెల్వన్ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండడంతో దర్శకుడు ఆర్.కన్నన్ తన చిత్రం విడుదలను వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు.
కాగా తన తాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఇందులో నటుడు మె ట్రో శిరీష్ హీరోగా నటించనున్నట్లు, మైత్రి అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలిసింది. అయి తే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.