
సాక్షి, చెన్నై: చిన్న గ్యాప్ తరువాత నటి హన్సిక మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. తాజాగా సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తనమసాలా, ఫోకస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఫైనాన్సియర్ మహీంద్ర నిహార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఇందులో నటి హన్సిక, నేత్ర అనే యువ సైంటిస్ట్‌గా నటిస్తున్నారని దర్శక నిర్మాత ఆర్.కన్నన్ తెలిపారు. చిత్రం కోసం స్థానిక ఈసీఆర్ రోడ్‌లో భారీ ఖర్చుతో సైన్స్ ల్యాబ్ సెట్ వేసినట్లు చెప్పారు. చిత్రంలోని గ్రాఫి క్స్ సన్నివేశాలు కోసం ప్రముఖ యానిమేషన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఛాయాగ్రహణం, సిద్ధార్థ్ సుభావెంకట్ డైలాగ్స్ రాస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment