జేఎన్‌టీయూ (అనంతపురం) పాలకమండలి సమావేశం సోమవారం ఇన్‌చార్జ్ వీసీ కె.రాజగోపాల్ అధ్యక్షతన వర్సిటీలో నిర్వహించారు. సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.
జేఎన్‌టీయూ:
జేఎన్‌టీయూ (అనంతపురం) పాలకమండలి సమావేశం సోమవారం ఇన్‌చార్జ్ వీసీ కె.రాజగోపాల్ అధ్యక్షతన వర్సిటీలో నిర్వహించారు. సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. సీమెన్స్ సెంటర్ భవన నిర్మాణానికి రూ. 13 కోట్లు కేటాయించారు. నూతనంగా బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి రూ. 4 కోట్లు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఓటీఆర్‌లోని ఫార్మసీ విభాగానికి ప్రత్యేకంగా ప్రిన్సిపాల్‌ను నియమించాలనే ప్రతిపాదనకు సమ్మతి తెలిపింది. ఇప్పటికే జరుగుతున్న భవన నిర్మాణం పనులకు ర్యాటిఫై చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, పాలకమండలి సభ్యులు బి. ప్రహ్లాదరావు, సి.శశిధర్, డాక్టర్ సీహెచ్ సత్యనారాయణ, రవీంద్ర సన్నారెడ్డి, రామానాయుడు, పి. సంగమేశ్వర రాజు, కెసి నాయుడు, ఏ.శ్రీకాంత్ గౌడ్, కె.మురళి పాల్గొన్నారు.