
ఎవరెస్ట్ శిఖరం 360 డిగ్రీల కెమెరా వ్యూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వర్చువల్ జర్నీ రూపంలో సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. పర్వతారోహకులు ఎదుర్కొనే కఠినమైన వాతావరణ పరిస్థితులను అనుభవంలోకి తెచ్చేలా ఉంటుంది ఈ వర్చువల్ జర్నీ. స్కిల్‌డ్ మౌంటెనీర్స్ టీమ్ ఈ ఫుటేజీని కాప్చర్ చేసింది.
‘ఏ 360 డిగ్రీ కెమెరా వ్యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్’ కాప్షన్‌తో అష్రఫ్ జక్ర ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. పర్వతారోహక బృందం ధైర్యసాహసాలకు, సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
‘టాప్ ఆఫ్ ది వరల్డ్! థ్యాంక్‌ఫుల్ ఫర్ గాడ్స్ క్రియేషన్’... నెటిజనుల నుంచి ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment