Everest peak
-
వర్చువల్ ఎవరెస్ట్ జర్నీ
ఎవరెస్ట్ శిఖరం 360 డిగ్రీల కెమెరా వ్యూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. వర్చువల్ జర్నీ రూపంలో సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. పర్వతారోహకులు ఎదుర్కొనే కఠినమైన వాతావరణ పరిస్థితులను అనుభవంలోకి తెచ్చేలా ఉంటుంది ఈ వర్చువల్ జర్నీ. స్కిల్డ్ మౌంటెనీర్స్ టీమ్ ఈ ఫుటేజీని కాప్చర్ చేసింది. ‘ఏ 360 డిగ్రీ కెమెరా వ్యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్’ కాప్షన్‌తో అష్రఫ్ జక్ర ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. పర్వతారోహక బృందం ధైర్యసాహసాలకు, సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘టాప్ ఆఫ్ ది వరల్డ్! థ్యాంక్‌ఫుల్ ఫర్ గాడ్స్ క్రియేషన్’... నెటిజనుల నుంచి ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
‘ఎవరెస్టు’ను అధిరోహించిన గిరిజన తేజం
యాచారం(ఇబ్రహీంపట్నం): గిరిపుత్రుడి సాహసయాత్ర విజయవంతమైంది. ప్రపంచంలోనే ఎల్తైన శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పాడు. అతడే అంగోత్ తుకారాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన తుకారాం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. ఏప్రిల్ 5న నేపాల్ నుంచి తుకారాం తన సాహసయాత్రను ప్రారంభించాడు. దాదాపు 50 రోజులపాటు ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకున్నాడు. ఈ నెల 22న 8,845 మీటర్ల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి అక్కడ జాతీయజెండాను ఎగురవేశాడు. 3 రోజుల క్రితమే ఎవరెస్టును అధిరోహించినప్పటికీ అక్కడ ప్రతికూల వాతావరణం ఉండటంతో బేస్‌క్యాంపు వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎవరెస్టును అధిరోహించినట్లు నేపాల్ ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు తుకారాం ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపాడు. ఈ సాహసయాత్రలో తాను ప్రాణాలతో వస్తానని అనుకోలేదని తెలియజేశాడు. శిఖరాన్ని అధిరోహించడానికి అన్నివిధాలుగా సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాంచంద్రునాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చిరాం, రైల్వే చీఫ్ ఇంజనీర్ తౌర్యానాయక్, పారిశ్రామిక వేత్త సుధాకర్‌రావుల సహకారంతో ఎవరెస్టు యాత్రకు బయలుదేరాడు. తుకారాం.. పర్వతారోహణలో దిట్ట అంగోత్ రాందాసు, జంకుల దంపతుల నాలుగో సంతానమైన తుకారాం పర్వతారోహణలో దిట్ట. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్‌లో శిక్షణ పొందాడు. 2016 జూన్ 2న మొదటిసారి హిమాచల్‌ప్రదేశ్‌లోని 17,145 అడుగుల నార్భో పర్వతా న్ని ఎక్కి తెలంగాణ జెండాను ఎగురేసి, బతుకమ్మ ఆడి రాష్ట్ర ఖ్యాతిని చాటాడు. 2017 జూన్ 2న ఉత్తరాఖండ్‌లో 19,091 అడుగుల రుదుగైరా పర్వతాన్ని అధిరోహించాడు. హిమాలయాల్లోని 20,187 అడుగుల స్టాక్‌కాంగ్రీ పర్వతాన్ని 2017 జూలై 15న అధిరోహించాడు. ఇలా పలు మంచు పర్వతాలు అలవోకగా అధిరోహించినందుకుగాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తుకారాం తన పేరు నమోదు చేసుకున్నాడు. 2018 జూలైలో సౌతాఫ్రికాలో 5,895 మీటర్ల కిలిమంజారో మంచు పర్వతాన్ని అధిరోహించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ల ప్రశంసలు పొందాడు. -
అడుగో సూర్యుడు!
సూర్యుడు ఉదయించాడు. అదే సమయంలో దీయా బజాజ్ ఎవరెస్టు శిఖరం మీద తొలి పాదం మోపింది. ఆమె తండ్రి అజీత్ బజాజ్ ఆమెకు ఒక్క అడుగు మాత్రమే వెనక ఉన్నాడు. ఐదు రోజుల క్రితమే.. మే 16న ఈ తండ్రీకూతుళ్లు ఆ మంచుకొండల్లో.. ఎల్తైన ఆ ఎవరెస్టు శిఖరం పైనుంచి సూర్యోదయం చూశారు. చిన్నతనంలో జాబిల్లిని చూపిస్తూ కూతురికి పాలబువ్వ తినిపించి ఉంటాడు ఆ తండ్రి. ఇప్పుడా కూతురే పెరిగి పెద్దదై ఎవరెస్ట్ పైనుంచి సూర్యుణ్ని చూపించింది తన తండ్రికి! వివక్షపై శిఖర సందేశం సరిగ్గా ఉదయం 4.30కి దీయా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. తరువాత ఆమె తండ్రి, వారితో పాటు షేర్పా సర్దార్ మినానీరు ఆమెను అనుసరించారు. బేస్ క్యాంపు నుంచి సాగిన ప్రయాణాన్ని దీయా తన బ్లాగులో లైవ్‌లో చూపుతూ వచ్చింది. వారి సాహసాలు, వాతావరణ పరిస్థితులు, ప్రకృతి అందాలు, వారు ఉన్న ప్రాంతం.. ఒకటేమిటి అన్ని విషయాలు కళ్లకు కట్టినట్లుగా చూపింది. ‘‘ప్రపంచంలోకెల్లా అతి ఎత్తయిన ప్రదేశం నుంచి నేను సూర్యోదయం చూశాను. ఇది నా జీవితంలో నేను మరిచిపోలేని క్షణం’’ అంటూ తన శిఖరయానం పూర్తయిన వెంటనే పులకరించిపోతూ పోస్ట్ పెట్టింది దీయా. భారతదేశంలో ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొట్టమొదటి తండ్రీకూతుళ్లు వీళ్లే కావడం విశేషం. సమాజంలో లింగ వివక్షను రూపుమాపాలన్న సందేశంతో ఈ సాహసయాత్రను చేపట్టారు వీళ్లు. శుభోదయ సాహసాలు ‘‘మా అమ్మాయికి తండ్రితో కలిసి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలని కోరిక. ఇక ఈ ప్రయాణానికి సంబంధించి మరో అంశం.. ‘అవకాశం ఇస్తే, ఆడపిల్లలు తమను తాము నిరూపించుకోగలగడమే కాదు, ఉన్నత శిఖరాలకు కూడా చేరుకోగలరు’ అని చెప్పడం కూడా’’ అని అజీత్ బజాజ్ భార్య షిర్లీ థామస్ బజాజ్ అన్నారు. ‘‘వేసవి సెలవుల్లో దీయా, ఆమె చెల్లి ఇద్దరూ ఉదయాన్నే లేచేవారు. వైల్డ్‌లైఫ్ సఫారీకి వెళ్లేవారు. స్కూబా డైవింగ్ చేసేవారు. అన్నీ సాహస క్రీడలే’’ అని చెబుతారు షిర్లీ తన కూతుళ్ల గురించి మురిపెంగా. స్కీయింగ్ కూడా కలిసే! అజీత్ మూడు దశాబ్దాలుగా సాహస క్రీడలలో పాల్గొంటూనే ఉన్నారు. ఉత్తర ధ్రువంలో స్కీయింగ్ చేసిన మొట్టమొదటి భారతీయుడు అనే రికార్డు కూడా ఆయన పేరు మీద ఉంది. 2011 మే నెలలో ఈ సాహసం చేశాడు. ఆ తరువాతి సంవత్సరమే అజీత్, దీయా కలిసి గ్రీన్లాండ్ ఐస్ క్యాప్ గుండా స్కీయింగ్ చేసిన మొదటి భారతీయులుగానూ గుర్తింపు పొందారు. వీరిని చూస్తే, ఈ తండ్రీ కూతురు కలిసి ఏ సాహసమైనా చేయగలరని, వారికి సాధ్యం కానిది ఏమీ ఉండదనిపిస్తుంది. స్వాప్నికుల కుటుంబం దీయా, అజీత్‌లకు ఎవరెస్టును జయించాలన్న కోరిక కలగడానికి చాలామందే ప్రేరణ అయ్యారు. చిన్నప్పటి నుంచి దీయా పర్వతారోహకుల గురించి వింటూండేది. వారికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూండేది. తండ్రికి ఒక ఆలోచనైతే ఉండేది... ‘ఎప్పటికైనా ఎవరెస్టును ఎక్కాలి’ అని. అలా ఇద్దరి ఆశలూ ఒకటయ్యాయి. ఢిల్లీలోని స్నో లెపార్డ్ అడ్వెంచర్‌లో దీయా తల్లి షిర్లీ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. 2012లో అజీత్‌కి స్కీయింగ్‌లో పద్మశ్రీ అవార్డు లభించింది. అటువంటి సాహస కుటుంబం నుంచి వచ్చిన దీయా.. యు.ఎస్. లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందాక తల్లిదండ్రుల బాటలోనే సాహసాల వెంట పయనించింది. -
చూసినవాళ్లే ఎక్కువ
సాధారణంగా దేవుడు కాంతి రూపంలో ప్రత్యక్షం అవుతాడని, అదే దైవ సాక్షాత్కారం అని అంటూ ఉంటారు. అయితే అది ‘కాంతి’ కాదు, ‘భ్రాంతి’ అని కొట్టిపడేసే ‘అప్రత్యక్ష’ వాదులూ ఉన్నారు. అప్రత్యక్షవాదులు అంటే.. దేవుడు ప్రత్యక్షం అయ్యాడంటే నమ్మనివాళ్లు. వాళ్లను అలా వదిలేస్తే.. దేవుడిని చూశామని, దేవుడితో మాట్లాడామని కొంతమంది చెబుతుంటారు. దేవుడంటే నమ్మకం లేనివాళ్లు కూడా, దేవుడిని చూశామని చెప్పినవాళ్లను నమ్మకుండా ఉండలేనంతగా గట్టిగా ఉంటాయి ఆ చెప్పేవాళ్ల అనుభవాలు. అసలు నమ్మకుండా ఉండడం ఎందుకు? ఎందుకంటే.. దేవుడు ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించడు కనుక. ఎవరెస్టు శిఖరం కనిపిస్తుంది. నయాగరా జలపాతం కనిపిస్తుంది. కశ్మీర్ లోయ కనిపిస్తుంది. దేవుడు అలా కనిపించడు. అందుకే కనిపించని దేవుడిని ప్రత్యక్షంగా చూశామంటే, ‘నాకు ప్రత్యక్షం అయ్యాడూ’ అంటే ఎవరూ నమ్మరు. అయినా దేవుడు శిఖరంలానో, జలపాతంలానో, లోయలానో ఎందుకు కనిపించాలి? ఆయనది కనిపించని వేరే రూపం అనుకోవచ్చు కదా. అప్పుడు దేవుడిని సందేహించే పని ఉండదు. ఏ రూపమూ లేనివాడు ఏ రూపంలో కనిపించినా ‘చూడ్డానికి’ మనసు అంగీకరిస్తుంది. అయితే దేవుడికి రూపం లేకుండా లేదు! ‘నమ్మకం’ ఆ రూపం. నమ్మకంలోంచి ఏర్పyì న రూపం! నమ్మకం ఒకటే. రూపాలు అనేకం. ఇలా ఆలోచిస్తే.. మన చుట్టూ దేవుణ్ణి చూడనివాళ్ల కంటే, దేవుణ్ణి చూసినవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. వీళ్లందరికీ ఏదో ఒక రూపంలో దేవుడు ప్రత్యక్షం అయ్యే ఉంటాడు. -
ఎవరెస్టుపైన డీజే మోత!
కాట్మాండు: ఎవరెస్టు శిఖరంపైన బ్రిటీష్ గాయకుడు పౌల్ వోకెన్ ఫోల్డ్ డేజే (డిస్క్ జాకీ) సంగీత ప్రదర్శన ఇవ్వనున్నాడు. దీని కోసం పౌల్ బృందం బేస్క్యాంపుకు చేరింది. నేడు ఇవ్వనున్న ఈ ప్రదర్శనతో భూమిపై అత్యంత ఎత్తు(5,380 మీటర్ల)లో డీజే నిర్వహించిన ఘనత పౌల్ బృందానికి దక్కనుంది. ఎవరెస్టు ఎక్కే సీజన్లో ఈ ప్రదర్శన ఇవ్వడంతో ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. యాబైమూడేళ్ల పౌల్ బ్రిటన్‌లో మంచి ప్రజాదరణ ఉన్న డీజే. మూడు సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అవడంతో పాటు మడోనా, యూ–2తో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. ‘పది రోజుల పాటు శ్రమించి అవసరమైన సంగీత సామాగ్రితో మా టీం ఇక్కడికి చేరుకుంది. ఇక్కడ గాలి తక్కువగా ఉంది. ఎత్తైన చోట ట్రెక్కింగ్ చేసి ప్రదర్శన ఇవ్వడం ఉద్వేగంగా ఉంద’ని పౌల్ అన్నాడు.