ఎవరెస్టుపైన డీజే మోత! | This British DJ is dropping beats from Mt. Everest | Sakshi
Sakshi News home page

ఎవరెస్టుపైన డీజే మోత!

Published Tue, Apr 11 2017 2:41 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

ఎవరెస్టుపైన డీజే మోత!

ఎవరెస్టుపైన డీజే మోత!

కాట్మాండు: ఎవరెస్టు శిఖరంపైన బ్రిటీష్‌ గాయకుడు పౌల్‌ వోకెన్‌ ఫోల్డ్‌ డేజే (డిస్క్‌ జాకీ) సంగీత ప్రదర్శన ఇవ్వనున్నాడు. దీని కోసం పౌల్‌ బృందం బేస్‌క్యాంపుకు చేరింది. నేడు ఇవ్వనున్న ఈ ప్రదర్శనతో భూమిపై అత్యంత ఎత్తు(5,380 మీటర్ల)లో డీజే నిర్వహించిన ఘనత పౌల్‌ బృందానికి దక్కనుంది.

ఎవరెస్టు ఎక్కే సీజన్‌లో ఈ ప్రదర్శన ఇవ్వడంతో ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. యాబైమూడేళ్ల పౌల్‌ బ్రిటన్‌లో మంచి ప్రజాదరణ ఉన్న డీజే. మూడు సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్‌ అవడంతో పాటు మడోనా, యూ–2తో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. ‘పది రోజుల పాటు శ్రమించి అవసరమైన సంగీత సామాగ్రితో మా టీం ఇక్కడికి చేరుకుంది. ఇక్కడ గాలి తక్కువగా ఉంది. ఎత్తైన చోట ట్రెక్కింగ్‌ చేసి ప్రదర్శన ఇవ్వడం ఉద్వేగంగా ఉంద’ని పౌల్‌ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement