
డీజే వాహనం సీజ్
రంగారెడ్డి జిల్లా : నిబంధనలను అతిక్రమించి భారీ సౌండ్లతో శబ్ద కాలుష్యానికి పాల్పడిన డీజే యాజమానితో పాటు, వివాహ నిర్వాహకులపై కేసు నమోదు చేసి, డీజే వాహనాన్ని సీజ్ చేశారు. సీఐ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కొండ్రిగానిబోడ్‌తండాలో ఆదివారం రాత్రి వివాహ వేడుక నిమిత్తం డీజేను ఏర్పాటు చేశారు.
అర్ధరాత్రి అతిగా సౌండ్స్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించడంతో.. స్థానికులు 100 నంబర్‌కు డయల్ చేశారు. ఈ మేర కు పోలీసులు తండాకు చేరుకుని డీజే వా హనాన్ని, పరికాలను సీజ్ చేశారు. సదరు యాజమానితో పా టు, నిర్వాహకులపై కేసు నమోదు చేశా రు. నిబంధనలను అతిక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా సౌండ్ బాక్స్‌లు పెడితే చట్టప రమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment