బీజింగ్: భారత్ ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన వర్చువల్‌గా జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్‌సీవో) శిఖరాగ్ర భేటీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని డ్రాగన్ దేశం చైనా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహా్వనం మేరకు ఎస్‌సీవో 23వ ప్రభుత్వాధినేతల సమావేశానికి జిన్‌పింగ్ హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 2001లో ఏర్పాటైన ఎస్‌సీవోలో భారత్, పాక్‌లు 2017లో శాశ్వత సభ్యదేశాలయ్యాయి. రొటేషన్ విధానంలో భారత్‌కు ఈ ఏడాది అధ్యక్ష స్థానం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment