సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించిన విషయం తెలిసిందే. అయితే, పలు షరతులు బన్నీకి న్యాయస్థానం విధించింది. ఇప్పుడు నాంపల్లి కోర్టులో పూచీకత్తు పత్రాలను అల్లు అర్జున్ వ్యక్తిగతంగా సమర్పించనున్నారు.
సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడం వల్లే తోపులాట జరిగిందని ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేయడంతో పాటు రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఆపై సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించింది. ఈ క్రమంలో రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని బన్నీకి కోర్టు షరతు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment