ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్‌పై గ్యాంగ్‌స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు.
గ్యాంగ్‌స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్‌పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్‌తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది.
ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే
Comments
Please login to add a commentAdd a comment