ముంబై: నగర మేయర్, శివసేన నాయకుడు కిషోరి ఫెడ్నెకర్‌ను చంపేస్తామని గుర్తుతెలియని దుండగులు ఆయనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో మేయర్ ఫిర్యాదు మేరకు దుండగులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గతేడాది డిసెంబర్ 21న తన మొబైల్‌కు గుర్తుతెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడని, ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నారని ఇటీవల దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన విలేకరులతో అన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. 2019 నవంబర్‌లో ముంబై మేయర్‌గా ఫెడ్నెకర్ ఎన్నికయ్యారు. చదవండి: (కామాంధుల క్రూరత్వం: పక్కటెముకలు, కాలు విరిచి)
Comments
Please login to add a commentAdd a comment