సాక్షి, బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది ఆ రాష్ట్ర కాంగ్రెస్. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడిన మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ పై మైసూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉరి గౌడ, నంజేగౌడలు టిప్పు సుల్తాన్‌ను అంతం చేసినట్లే.. సిద్ధరామయ్యను సైతం చంపేయాలని పబ్లిక్ మీటింగ్‍లో అశ్వత్ నారాయణ్ మాట్లాడినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అశ్వత్ నారాయణ్‌ను అరెస్టు చేయాలని పోలీసులను కర‍్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రతినిధి ఎమ్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
18 వ శతాబ్దానికి చెందిన మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్. బ్రిటీషర్ల పోరాటంలోనూ టిప్పు సుల్తాన్ మరణించలేదు. కానీ ఒక్కలిగ జాతికి చెందిన ఉరి గౌడ, నంజె గౌడల చేతిలో చనిపోయాడు. 'టిప్పు మద్దతుదారుడు సిద్ధరామయ్య ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాడు. మీకు టిప్పు కావాలా? లేక హిందుత్వాన్ని కాపాడిన సావర్కర్ కావాలా?. నంజెగౌడ ఎం చేశారు?. అదే విధంగా సిద్ధరామయ్యను కూడా చేయాలి' అని పబ్లిక్ మీటింగ్‍లో మాట్లాడే క్రమంలో సిద్ధరామయ్యను టిప్పుతో పోల్చుతూ మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ అన్నారు.
(అక్కడ ఐక్యత చూశా.. విపక్షాల బాయ్‌కాట్ నిర్ణయంపై ప్రధాని చురకలు!)
నేనొస్తే టిప్పు సుల్తాన్ వచ్చినట్టే
అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. తనపై ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 'నన్ను అంతం చేయనిస్తారా?. నేను అధికారంలోకి వచ్చానంటే టిప్పు అధికారంలోకి వచ్చినట్టే. టిప్పు సుల్తాన్, కిట్టుర్ రాణి చెన్నమ్మ, సంగోళి రాయన్న అంటే నాకు ఎంతో గౌరవం' అని పబ్లిక్ ర్యాలీలో అన్నారు. అయితే ఫిబ్రవరిలోనే మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఫిర్యాదు చేశారు. కానీ అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం పోలీసులకు కాంగ్రెస్ మరోసారి ఫిర్యాదు చేసింది.
నేనలా అనలేదు
ఈక్రమంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పారు. ఎన్నికల్లో ఓడించాలనే ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. 'నేను సిద్ధరామయ్యను టిప్పు సుల్తాన్‌తో పోల్చాను. సిద్ధరామయ్యకు టిప్పు సుల్తాన్‌పై ఉన్న ప్రేమ గురించి మాట్లాడాను. సిద్ధరామయ్యపై నేనేమీ అవమానకరంగా మాట్లాడలేదు. రాజకీయ, భావజాల వైరుధ్యాలే తప్ప సీఎంపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి క్షక్షపూరిత ఆలోచనలు లేవు. నా వ్యాఖ్యలు ఏవైనా ఆయన మనోభావాలను దెబ్బతీస‍్తే అందుకు చింతిస్తున్నాను' అని అసెంబ్లీలో మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పుకొచ్చారు.
(మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!)
Comments
Please login to add a commentAdd a comment