
జైపూర్: లోక్‌సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు చెందిన మంత్రి బాబులాల్ ఖరాడీను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వంలో బాబులాల్ ఖరాడీ గిరిజన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా(ఇన్స్‌స్టాగ్రామ్) వేదికగా మంత్రి బాబులాల్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మేసేజ్‌లో బాబులాల్‌ను చంపేస్తానని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు.
Babulal Kharadi Receives Death Threat: बाबूलाल खराड़ी को सोशल मीडिया पर मिली धमकी | Udaipur | BJP#RajasthanWithFirstIndia #BabulalKharadi #BJP #Udaipur #RajasthanNews #RajasthanPolitics #DeathThreats pic.twitter.com/s7iL3WY7Gc
— First India News (@1stIndiaNews) May 4, 2024
ఈ నేపథ్యంలో మంత్రి బాబులాల్ కుమారుడు.. ఈ మెసేజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు రోజుల క్రితం ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. అయితే, గిరిజనులను హిందూ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ మంత్రిని చంపేస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించినట్లు చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై ఉదయ్‌పూర్‌లోని కొద్దా పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.