
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన కుటుంబ సభ్యులను హతమారుస్తామని ఏకంగా సీఎం కార్యాలయానికి లేఖ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృత్యువాత పడిన ఘటనను ఈ లేఖలో ప్రస్తావించారు. కొద్దిమంది కామ్రేడ్లను నిర్మూలించడంతో విప్లవం ఆగదని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.
సీఎం కార్యాలయానికి బెదిరింపు లేఖ అందడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు గడ్చిరోలి పోలీసులు తెలిపారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ గడ్చిరోలి జిల్లా భంరగ తాలూకాలో కరపత్రాలు, బ్యానర్లు వెలిశాయి. అత్యున్నత స్థాయి వ్యక్తులకు బెదిరింపు లేఖ రావడం ఒకేరోజులో ఇది రెండవది కావడం గమనార్హం.
రాజీవ్‌గాంధీని హతమార్చిన తీరులో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్రపన్నినట్టు ఈ మేరకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించారని పూణే పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించిన లేఖను వారు విడుదల చేశారు.మావోయిస్టులు గత ఏడాది ఏప్రిల్‌లో ఆ లేఖను రాసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment