లండన్‌కి బై బై | dhanush is a gangster role in karthik subbaraj next | Sakshi
Sakshi News home page

లండన్‌కి బై బై

Published Sat, Nov 9 2019 3:30 AM | Last Updated on Sat, Nov 9 2019 3:30 AM

dhanush is a gangster role in karthik subbaraj next - Sakshi

సెటిల్‌మెంట్‌లు, దందాలు చేయడం కోసం గ్యాంగ్‌స్టర్‌గా లండన్‌ వెళ్లారు ధనుష్‌. అక్కడ పనులన్నీ చక్కబెట్టి తిరిగి ఇండియా బయలుదేరారు. మరి.. సెటిల్‌మెంట్స్‌ను ధనుష్‌ ఏ స్టైల్లో సెటిల్‌ చేశారో వచ్చే ఏడాది వెండి తెరపై చూపిస్తాం అంటున్నారు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా చిత్రీకరణ ప్యాచ్‌ వర్క్‌ మినహా పూర్తయింది. ఇందులో ధనుష్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్ర చేశారు. ఆ మధ్య ఈ సినిమా చిత్రీకరణ యూకేలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘‘నాన్‌స్టాప్‌గా 64 రోజులు లండన్‌లో షూట్‌ చేశాం. చిత్రీకరణ ముగిసింది’’ అని పేర్కొన్నారు నిర్మాత శాష్‌.  ఈ సినిమాలో హాలీవుడ్‌ నటుడు జేమ్స్‌ కాస్మో ఓ కీలక పాత్ర పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement