సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో రాజేంద్రనగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఒడ్డున ఉన్న కాలనీల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వేయడంతో చాదర్ ఘాట్ మూసీ పరివాహక ప్రాంతాలలో ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళాలని అధికారులు ఆదేశించారు. అయితే తమకు పునరావాసం కేంద్రాలు ఏర్పాట్లు చేయకుండా.కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వెల్లుతామని బాధితులు వాపోతున్నారు.
#HyderabadRains కృష్ణానగర్ పూర్ణా టిఫిన్ గల్లీలో వరద భీభత్సం pic.twitter.com/ysY9c8D2nG
— keshaboina sridhar (@keshaboinasri) September 5, 2023
ఇక.. ఇప్పటికే కురిసిన కుండపోత వానతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలో ఏవైపు చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బేగంపేట ప్రకాశ్ నగర్ దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రగతి భవన్ ఎదురుగానూ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
Water logging in several areas of #Hyderabad after hours of rains; these visuals from near #MoosapetMetro station; bike that was washed away in waters, got stuck in a manhole in #Borabanda & was retrieved #HyderabadRains @ndtv @ndtvindia pic.twitter.com/bgNdwV2aLe
— Uma Sudhir (@umasudhir) September 5, 2023
పంజగుట్ట నుంచి బేగంపేట ఫ్లై ఓవర్ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో.. దాదాపు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. శంషాబాద్‌లోనూ భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. జీడిమెట్ల ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో నీరు నిలిచింది. కూకట్‌పల్లిలో 14 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. కూకట్‌పల్లి దీన్‌దయాల్ నగర్‌లోకి వరద నీరు చేరింది. ఫతేనగర్ రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంపేట ఈశ్వర విల్ల ఐదు అడుగుల మేర నీట మునిగింది. ఆల్వాల్ మచ్చబొల్లారంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నార్సింగిలోని బాలాజీ నగర్ కాలనీ చెరువును తలపిస్తోంది. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నా.. అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment