వివేక్ ఎక్స్ ప్రెస్లో హిజ్రాల బీభ‌త్సం | Man thrown out of running train by hijras | Sakshi
Sakshi News home page

వివేక్ ఎక్స్ ప్రెస్లో హిజ్రాల బీభ‌త్సం

Published Mon, Sep 21 2015 4:12 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

వివేక్ ఎక్స్ ప్రెస్లో హిజ్రాల బీభ‌త్సం - Sakshi

వివేక్ ఎక్స్ ప్రెస్లో హిజ్రాల బీభ‌త్సం

శ్రీకాకుళం (టెక్కలి) : మంగ‌ళూరు నుంచి స‌త్ర‌గ‌చ్చి వెళ్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్‌ లో సోమవారం హిజ్రాలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...కొంతమంది హిజ్రాలు సోమవారం వివేకానంద్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయసాగారు.

అయితే అడిగినంత డబ్బులివ్వలేదని కదులుతున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడిని బయటకు తోసేసి, మరో ప్రయాణికుడిని చితకబాదారు హిజ్రాలు. రైల్లో నుంచి కిందపడ్డ ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించగా.. దాడిలో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన టెక్కలి మండలంలోని నౌపడ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు ఒడిస్సాలోని నయాగఢ్ జిల్లాకు చెందిన పూర్ణచంద్రసాహు(45)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి ఫకీర్ బెహ్రాగా గుర్తించారు.  ప్రయాణికులను తోసేసిన అనంతరం హిజ్రాలు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement