
కర్ణాటక, గంగావతి రూరల్: కొప్పళ నగరంలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి బైక్‌లపై బయట తిరిగే వారికి సోమవారం మంగళముఖిలు (హిజ్రాలు) వినూత్నంగా జాగృతి కల్పించారు. రాఖీ కట్టి, బొట్టు పెట్టి, అనవసరంగా తిరగవద్దు, కరోనాకు గురికావద్దు అని హితబోధ చేశారు. కోరనా వైరస్ నివారణ కోసం ప్రపంచమే లాక్‌డౌన్ పాటిస్తోందన్నారు. అయినా ప్రజలు గుంపులుగా తిరగడం మానలేదన్నారు. బైక్ చోదకులు అనవసరంగా నగర వీధులలో తిరగడం మానాలని హిజ్రాలు విన్నవించారు. అన్నలారా బైకులపై తిరగకండి, కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుంది, అందువల్ల ప్రస్తుతం దేశ ప్రధాని పిలుపును మనం అందరం పాటించి కరోనా నివారణలో భాగం కావాలని యువతకు సూచించారు. నగరంలోని అశోక సర్కిల్ ఈ జాగృతికి వేదికైంది. డీఎస్పీ వెంకటప్ప నాయక, సీఐ మౌనేశ్వర పాటిల్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment