హిజ్రాగా మారిన భార్య స్నేహితురాలితో సహజీవనం.. | - | Sakshi
Sakshi News home page

భర్తకు ట్విస్టు.. హిజ్రాగా మారిన తన భార్య మూడు నెలల గర్భవతి...

Published Sun, Oct 1 2023 1:04 AM | Last Updated on Sun, Oct 1 2023 8:48 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: అదృశ్యమైన తన భార్య తిరునంబీగా (హిజ్రా) మారి స్నేహితురాలితో సహజీవనం చేస్తుండడం ఓ భర్తకు షాక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం వివరాలు.. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని అర్థనారీ పాళయానికి చెందిన 27 ఏళ్ల యువకుడికి ఏడు నెలల క్రితం సమీపంలోని మరో గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. ఓ మూడు నెలలు అత్తారింట్లో ఉన్నా గంటల తరబడి తన స్నేహితురాలైన యువతితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది.

భర్తను దూరం పెట్టడమే కాకుండా, ఆమె నడవడిక మారడంతో కుటుంబ సభ్యులు అందరూ విస్మయం చెందారు. ఆ తర్వాత ఓ రోజున ఆమె అదృశ్యమైంది. తన భార్య కనిపించడం లేదంటూ ఆలియూరు పోలీసులను ఆ భర్త ఆశ్రయించాడు. పోలీసులు యువతి కోసం మూడు నెలలు తీవ్రంగానే గాలించారు. చివరకు విచారణలో ఆ యువతి తిరునంబీ (హిజ్రా)గా మారి చైన్నెలో తన స్నేహితురాలితో కలిసి భార్య, భర్తలుగా జీవనం సాగిస్తున్నట్లుగా గుర్తించారు. గత వారం రంగంలోకి దిగిన పోలీసులు హిజ్రాగా మారిన ఆ యువతిని, ఆమె స్నేహితురాలిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ఈ ఇద్దర్నీ విడదీశారు. హిజ్రాగా మారిన తన భార్యను చూసిన ఆ భర్తకు షాక్‌ తప్పలేదు. హిజ్రాగా మారిన ఆ యువతిని ఆమె భర్తతో పోలీసులు పంపించేశారు. స్నేహితురాలిని చైన్నెకు వెళ్లమని ఆదేశించారు. ఇక్కడే అసలైన ట్విస్టు ఆ భర్తకు ఎదురైంది. హిజ్రాగా మారిన తన భార్య మూడు నెలల గర్భవతి అని తేలడంతో తలలు పట్టుకున్నారు. ఆ నోటా... ఈ నోటా పడి చివరకు గ్రామానికి ఈ సమాచారం తెలియడంతో శనివారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇదే అదనుగా హిజ్రాగా మారిన ఆ యువతి, చైన్నెలోని తన స్నేహితురాలి వద్దకే మళ్లీ ఉడాయించడం గమనార్హం. దీంతో తన మానసిక పరిస్థితి ఏమిటో అంతు చిక్కక ఆ భర్త మళ్లీ పోలీసుల వద్దకు వచ్చి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement