
లారా నాలుగేళ్ల ముందు హిజ్రాగా మారాడు. మద్యం అలవాటు వున్న లారా రోజూ మద్యం తాగి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ఇరుగుపొరుగుతో చెప్పేవాడు..
సాక్షి, తిరువొత్తియూరు: మద్యం మత్తులో హిజ్రా నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నై వ్యాసార్పాడిలో సోమవారం సాయంత్రం జరిగింది. చెన్నై వ్యాసార్పాడి బి.కల్యాణపురం ఆరవ వీధికి చెందిన నాగప్పన్ భార్య రాజకళ. వీరికి వున్న నలుగురు పిల్లలు. పెద్ద కుమారుడు సూర్య అనే లారా (29). నాలుగేళ్ల ముందు హిజ్రాగా మారాడు.
మద్యం అలవాటు వున్న లారా రోజూ మద్యం తాగి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ఇరుగుపొరుగుతో చెప్పేవాడు. సోమవారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన లారా ఇంటిలో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. గాయపడ్డ అతన్ని చెన్నై కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.