రాయచూరు రూరల్: శఽక్తి పథకంలో ట్రాన్స్‌జెండర్ల(హిజ్రా)కు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కండక్టర్‌తో హిజ్రా వాదించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌లో రాయచూరు నుంచి యాదగిరి వెళ్లే బస్సులో లక్ష్మి అనే హిజ్రా ప్రయాణానికి బయల్దేరింది. ఉచిత టికెట్ కోసం ప్యాసింజర్ లక్ష్మి తన ఆధార్ కార్డును తీసి కండక్టర్‌కు ఇచ్చింది.
అయితే కండక్టర్ ఈ ఆధార్ చెల్లదని టికెట్‌కు డబ్బులివ్వాలన్నాడు. లక్ష్మి తాము కూడా మహిళల విభాగంలోకి వస్తామని సీఎం తెలిపారని బదులివ్వడంతో వివాదం సద్దుమణిగింది. హిజ్రా లక్ష్మి చొక్కా, జీన్స్ ప్యాంట్ ధరించడంతో పురుషుడు అనుకుని కండక్టర్ వాదనకు దిగాడు. కాగా లక్ష్మిని యాదగిరి జిల్లా శహపుర తాలూకా తడబడి గ్రామ నివాసిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment