
మరుగుదొడ్లను ప్రారంభిస్తున్న బీసీ సంక్షేమ శాఖ అధికారి మీనా
తిరువళ్లూరు: తిరువళ్లూరు బస్టాండ్‌లో హిజ్రాల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. వీటిని బీసీ సంక్షేమ శాఖ అధికారి మీనా గురువారం ప్రారంభించారు. తిరువళ్లూరు బస్టాండులో స్త్రీలు, పురుషులకు, దివ్యాంగులకు మరుగుదొడ్లు నిర్మించారు. స్త్రీల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను హిజ్రాలు ఉపయోగించే వారు. అయితే ఇటీవల హిజ్రాలను అనుమతించకపోవడంతో వారు మున్సిపల్ కమిషనర్ సెంథిల్‌కుమారన్‌ను కలిసి ప్రత్యేక మరుగుదొడ్డి నిర్మించాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కమిషనర్ హిజ్రాల కోసం ప్రత్యేక మరుగుదొడ్డిని నిర్మించారు. దీనిని బీసీ సంక్షేమ శాఖ అధికారి మీనా గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళనాడులో హిజ్రాల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను గతంలో సేలం జిల్లాలో ప్రారంభించారని, ప్రస్తుతం తిరువళ్లూరులో ప్రారంభించడం రెండో ప్రాంతమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment