వార్డు పదవికి హిజ్రా నామినేషన్ | Hijra Shaik Meira contest nandyal municipality ward member | Sakshi
Sakshi News home page

వార్డు పదవికి హిజ్రా నామినేషన్

Published Wed, Mar 12 2014 4:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

వార్డు పదవికి హిజ్రా నామినేషన్

వార్డు పదవికి హిజ్రా నామినేషన్

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ పదవికి ఓ హిజ్రా నామినేషన్ దాఖలు చేశారు. కడప జిల్లాకు చెందిన షేక్ సమీరా బీఎస్సీ హోంసైన్స్ అభ్యసించారు. రెండేళ్ల నుంచి నంద్యాలలో స్థిరపడి సమతా హిజ్రాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. పట్టణంలోని 6వ వార్డులో 85 మంది హిజ్రాలకు ఓటు హక్కు ఉంది.

అన్ రిజర్వ్ వార్డు కావడంతో మంగళవారం షేక్ సమీరా తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించానని.. అవమానాలను కూడా భరించానన్నారు. మేమూ అందరిలా మనుషులమని చాటేందుకే పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement