నంద్యాల మున్సిపల్ సమావేశంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల హెచ్చరిక
నంద్యాల: అధికారం శాశ్వతం కాదని, చేపట్టే మంచి పనులే కలకాలం నిలుస్తాయని కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు కౌన్సిలర్లు శివశంకర్, కరీముల్లా, ముడియం కొండారెడ్డి, కృపాకర్, దిలీప్‌లతోపాటు కొందరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై నమోదు చేసిన రౌడీషీట్లను ఎత్తేయాలని కోరుతూ.. శనివారం జరిగిన మున్సిపల్ సమావేశానికి వారు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు.
చైర్‌పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముక్కెర అనూష ఆధ్వర్యంలో తొమ్మిదిమంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ గతనెల సమావేశంలో అధికార పార్టీ నేతలు ఘర్షణలు సృష్టించి రాజకీయలబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇందుకు ఆ పార్టీ నేత శిల్పా మోహన్‌రెడ్డి, చైర్‌పర్సన్ సులోచన బాధ్యత వహించాలన్నారు. రెండు గంటల పాటు సాగిన సమావేశంలో అధికార పార్టీ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించినా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు సంయమనం పాటిస్తూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
అధికారపార్టీ ఆగడాలను ఎదుర్కొంటాం
Published Sun, Nov 30 2014 2:29 AM | Last Updated on Tue, May 29 2018 3:40 PM
Advertisement
Advertisement