
పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్న హిజ్రా చంద్రముఖి
బంజారాహిల్స్: తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిజ్రా చంద్రముఖి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో ఉంటున్న చంద్రముఖి శుక్రవారం సాయంత్రం బయటికి వెళ్తుండగా సనమ్ అనే మరో హిజ్రా ఆమెను అడ్డుకుని ప్రతిరోజూ తమ కదలికలను పోలీసులకు చేరవేస్తున్నావంటూ అసభ్యంగా దూషించింది. దీంతో మనస్తాపానికి గురైన చంద్రముఖి తన గదిలోకి వెళ్ళి చేతిపై బ్లేడ్‌తో గాట్లుపెట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి హిజ్రాలు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చంద్రముఖి తనను దూషించిన సనమ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment