
హిజ్రాను పెళ్లాడిన యువకుడు
గంగావతి(కర్ణాటక): హిజ్రాలను కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కర్ణాటకలోని కొప్పళ నగరంలో ఓ యువకుడు హిజ్రాను వివాహమాడాడు. ఈ విషయం గురువారం వెలుగు చూసింది. కొప్పళ నగరంలోని గదిగేరి క్యాంపులో ఉండే శివకుమార్(25) అనే యువకుడు రాధిక (24) అనే హిజ్రాను మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు.
ఈ వివాహాన్ని శివకుమార్ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తమకు భద్రత కల్పించాలని రాధిక, శివకుమార్ గురువారం పోలీసులను ఆశ్రయించారు. తాను రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని శివకుమార్ తెలిపాడు.