Koppala
-
కార్యాలయంలో రాసలీలలు
సాక్షి, బళ్లారి: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారి దారితప్పి ఏకంగా కార్యాలయంలోనే ఓ మహిళతో ముద్దుముచ్చట్లకు పాల్పడడం సంచలనమైంది. కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్ గురుబసవరాజు రెండు నెలల క్రితం కుష్టిగి తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆఫీసులోని ఓ మహిళా ఉద్యోగికి ముద్దుపెడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈనేపథ్యంలో ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జోగ్‌ఫాల్స్ వద్ద టెక్కీ ఆత్మహత్యాయత్నం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన ఐటీ ఇంజనీరు జలపాతం నుంచి దూకి ప్రాణాలు తీసుకోబోయాడు. పోలీసుల జోక్యంతో విరమించుకున్నాడు. బెంగళూరులో నివసించే టెక్కీ చేతన్ కుమార్‌కు ఇటీవల ఉద్యోగం పోయింది. దీంతో జీవితం మీద విరక్తి చెందిన శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ జోగ్ జలపాతం నుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అధికారులు కళ్లుగప్పి జలపాతం ఎగువకు చేరుకున్నాడు. మొబైల్, లగేజ్ అన్నింటిని 960 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడేశాడు. ఇంతలో భద్రతా సిబ్బంది గమనించి అతన్ని వారించారు. ఇంతలో పోలీసులు కూడా చేరుకున్నారు. అందరూ దూరం నుంచే చేతన్‌తో మాట్లాడి వెనక్కి వచ్చేలా ఒప్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు చేతన్ జలపాతం నుంచి వెనక్కి రావడంతో కథ సుఖాంతమైంది. అనూహ్య ప్రమాదం సాక్షి, బళ్లారి: ఇనుప కడ్డీల లోడుతో నిలబడి ఉన్న లారీని కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కండక్టర్ శరణప్ప (40) దేహంలోకి కడ్డీలు గుచ్చుకుని విలవిలలాడాడు. బుధవారం తెల్లవారుజామున బళ్లారి జిల్లా కూడ్లిగి సమీపంలోని జాతీయ రహదారి– 58 పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుష్టిగి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోతూ నిలిపిఉన్న ఇనుపరాడ్ల లారీని వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బస్సులోకి కడ్డీలు చొచ్చుకుపోయాయి. కండక్టర్ దేహంలోకి చొచ్చుకుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గంటకుపైగా కండక్టర్ ఎటూ కదల్లేక నరకం అనుభవించాడు. 108 అంబులెన్స్, ఫైర్ సిబ్బంది వచ్చి కండక్టర్ శరీరం నుంచి కడ్డీలను కత్తిరించి బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, ముగ్గురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. -
హిజ్రాను పెళ్లాడిన యువకుడు
గంగావతి(కర్ణాటక): హిజ్రాలను కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కర్ణాటకలోని కొప్పళ నగరంలో ఓ యువకుడు హిజ్రాను వివాహమాడాడు. ఈ విషయం గురువారం వెలుగు చూసింది. కొప్పళ నగరంలోని గదిగేరి క్యాంపులో ఉండే శివకుమార్(25) అనే యువకుడు రాధిక (24) అనే హిజ్రాను మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని శివకుమార్ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తమకు భద్రత కల్పించాలని రాధిక, శివకుమార్ గురువారం పోలీసులను ఆశ్రయించారు. తాను రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని శివకుమార్ తెలిపాడు. -
వైభవంగా హులిగమ్మదేవి మహారథోత్సవం
దక్షిణ కర్ణాటకలో ఆదిశక్తి దేవతగా ప్రఖ్యాతి గాంచిన కొప్పళ జిల్లాలోని హులిగిలో వెలసివున్న హులిగమ్మదేవి మహారథోత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత ఘనం గా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారిని పూల మాలలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. అక్కిపడె తదితర ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని పల్లకిలో రథం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారిని రథంపై ఉంచి రథాన్ని లాగారు. రథంపైకి భక్తులు పూలు, పండ్లను విసిరి మొక్కులు తీర్చుకొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. - హొస్పేట -
కొప్పళలో ఉద్రిక్తత
కొనసాగుతున్న రెండు సామాజిక వర్గాల ఘర్షణ పోలీసులు, ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి = లాఠీచార్జ, పలువురికి గాయాలు బళ్లారి(కొప్పళ): కొప్పళలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు శోభాయాత్ర నిర్వహిస్తుండగా నగరంలోని సాలార్జంగ్ రోడ్డులో పలువురు ఆకతాయిలు పోలీసులపై రాళ్లు రువ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, ఎస్పీ వాహనం మీద కూడా రాళ్లు విసిరారు. పోలీసులు లాఠీచార్జ చేసి పరిస్థితిని అదుపు చేశారు. ముందు జాగ్రత్తగా కొప్పళలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించారు. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణను నిలువరించేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. శోభాయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈశాన్య రేంజ్ ఐజీ సునీల్ అగర్వాల్ తెలిపారు. ఆయన ఘర్షణ జరిగిన స్థలాన్ని పరిశీలించారు.