కొప్పళలో ఉద్రిక్తత | Two communities clash | Sakshi
Sakshi News home page

కొప్పళలో ఉద్రిక్తత

Published Sat, Feb 7 2015 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

కొప్పళలో ఉద్రిక్తత

కొప్పళలో ఉద్రిక్తత

కొనసాగుతున్న రెండు సామాజిక వర్గాల ఘర్షణ
పోలీసులు, ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి = లాఠీచార్‌‌జ, పలువురికి గాయాలు

 
బళ్లారి(కొప్పళ): కొప్పళలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు శోభాయాత్ర నిర్వహిస్తుండగా నగరంలోని సాలార్‌జంగ్ రోడ్డులో పలువురు ఆకతాయిలు పోలీసులపై రాళ్లు రువ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, ఎస్పీ వాహనం మీద కూడా రాళ్లు విసిరారు. పోలీసులు లాఠీచార్‌‌జ చేసి పరిస్థితిని అదుపు చేశారు. ముందు జాగ్రత్తగా కొప్పళలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించారు.

రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణను నిలువరించేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. శోభాయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈశాన్య రేంజ్ ఐజీ సునీల్ అగర్వాల్ తెలిపారు. ఆయన ఘర్షణ జరిగిన స్థలాన్ని పరిశీలించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement