సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం ట్రాన్స్‌జెండర్ హక్కులపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై శుక్రవారం ఢిల్లీలో ఒబామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సులో బెంగళూరు ట్రాన్స్‌జెండర్ అకాయ్ పద్మశాలి ఒబామాను వివిధ విషయాల పై ప్రశ్నించడమే కాకుండా తమ వర్గం సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రసంగించనున్నారు.
ఎవరీ అకాయ్....
అకాయ్ పద్మశాలి బెంగళూరులో పుట్టి పెరిగాడు. ఇక్కడే పదో తరగతి వరకు చదివాడు. తను ఉండాల్సింది ఇలా కాదని అనిపించి ట్రాన్స్‌జెండర్‌గా మారారు. సమాజం నుంచి చీత్కారాలు పై చదువులకు దూరంచేశాయి. తనలాంటి థర్డ్‌జెండర్స్‌కు సమాజంలో ఎదురవుతున్న అవమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు, హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. ఈమె కర్ణాటక ప్రభుత్వ రాజ్యోత్సవ అవార్డుతో పాటు పలు జాతీయ పురస్కారాలనూ పొందారు.
ఒబామాతో భేటీకి నిరీక్షణ: అకాయ్
ఒబామాతో భేటీ విషయమై అకాయ్ పద్మశాలి ‘సాక్షి’తో మాట్లాడుతూ....‘ ఈ సదస్సులో పాల్గొనడం కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను. ఒబామా ఇప్పటికే అమెరికాలో లైంగిక అల్ప సంఖ్యాకుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ విషయాలపై నేను ఆయనను ప్రశ్నించనున్నాను’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment