అశ్వత్థామ (పూజా)
రాయచూరు రూరల్(కర్ణాటక): అవకాశాలు ఇస్తే ఏ రంగంలోనైనా ప్రతిభ చాటుకుంటామని హిజ్రాలు రుజువు చేస్తున్నారు. అశ్వత్థామ అలియాస్ పూజా (26) అనే ట్రాన్స్‌జెండర్ ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా ఎంపికయ్యారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉపాధ్యాయ పరీక్షలలో పూజా కి ఉద్యోగం దక్కింది.
మాన్వి తాలూకా నీరమాన్విలో ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్‌గా ఇప్పుడు పనిచేస్తున్నారు. హిజ్రా కోటాలో ఉద్యోగం లభించినట్లు పూజా తెలిపారు. ఆమె నీరమాన్విలోనే టెన్త్ వరకూ కన్నడలో విద్యనభ్యసించింది. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. పూజా మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులో ఉండగా హిజ్రాగా మారినట్లు తెలిపారు. చదువుపై ఇష్టంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని బీఏ, బీఈడీ పూర్తి చేసినట్లు చెప్పారు.
చదవండి: Hyderabad: మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొంపముంచిన ‘చిత్రాలు’
Comments
Please login to add a commentAdd a comment