
కుష్బుపై కేసు నమోదు
మదురై : మదురై కోర్టులో కాంగ్రెస్ ప్రచారకార్యదర్శి నటి కుష్బుపై హిజ్రా కేసు దాఖలు చేసింది. మదురై వడంపోక్కి వీధికి చెందిన భారతి కన్నమ్మ మదురై కేంద్ర నియోజకవర్గంలో పోటీ చేస్తోంది. ఈ హిజ్రా మదురై 4వ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖ లు చేసిన పిటిషన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచారకార్యదర్శి నటి కుష్భు 2వ తేదీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిజ్రాలను కించపరిచే విధంగా మా ట్లాడినట్లు పేర్కొన్నారు. హిజ్రాలకు తగిన రాయితీలు, హక్కులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష యం అందరికీ తెలిసిందే. ఈ స్థితిలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అనే విషయంపై హిజ్రాలు ఆలోచించాలి అనడం తమను అవమానించే విధంగా ఉందన్నారు.
దీనిపై గత 13వ తేదీ మదురై తెర్కువాసల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినా ఇంతవరకు దానిపై చర్య తీసుకోలేదన్నారు. అందువలన కుష్బుపై చర్య తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మెజిస్ట్రేట్ సబీనా సమక్షంలో శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాదులు హాజరై వాదించారు. మెజిస్ట్రేట్ సబీనా కేసును 25వ తేదీకి వాయిదా వేశారు.