రజనీ అల్లుడు ధనుష్‌కు భారీ ఊరట! | Actor Dhanush gets relief | Sakshi
Sakshi News home page

రజనీ అల్లుడు ధనుష్‌కు భారీ ఊరట!

Published Fri, Apr 21 2017 11:09 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

రజనీ అల్లుడు ధనుష్‌కు భారీ ఊరట! - Sakshi

రజనీ అల్లుడు ధనుష్‌కు భారీ ఊరట!

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌కు ఊరట లభించింది. ధనుష్‌ తమ కొడుకేనంటూ మేలూరు వృద్ధ దంపతులు వేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ కొట్టిపారేసింది. నటుడు ధనుష్‌ తమ కుమారుడేనని, చిన్నప్పుడు స్కూలు చదువు మధ్యలోనే మానేసి.. ఇంటి నుంచి పారిపోయాడని మేలూరుకు చెందిన కదిరేశన్‌-మీనాక్షి దంపతులు మధురై కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి కొన్ని పత్రాలను సైతం కోర్టుకు ఆ దంపతులు సమర్పించారు.

దీంతో పుట్టుమచ్చలు చూపించాలని హీరో ధనుష్‌కు కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో ఆ దంపతులు పేర్కొన్నవిధంగా ధనుష్‌కు పుట్టుమచ్చలు లేకపోవడంతో లేజర్‌ ట్రీట్‌మెంట్‌తో ఆయన తొలగించుకొని ఉంటాడని అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలో డీఎన్‌ఏ టెస్టుకు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వగా.. అందుకు ధనుష్‌ నిరాకరించాడు. ఈ క్రమంలో వాదనలు విన్న మధురై బెంచ్‌ వృద్ధ దంపతుల పిటిషన్‌ను తోసిపుచ్చి.. ధనుష్‌కు ఊరటనిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement